Ap News: దర్శిలో టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదం.. ఉద్రిక్తత

దర్శిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది...

Update: 2024-12-27 07:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా దర్శి(Prakasam District Darshi)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ చార్జిల పెంపును నిరసిస్తూ వైసీపీ(Ycp) నేతలు నిరసలు కొనసాగిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన పాపం వల్లే విద్యుత్ ఛార్జిల పెంపు అంటూ దర్శి గడియారం స్తంభం వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. అటు టీడీపీ(Tdp) నేతలు కూడా భారీగా మోహరించడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి పోలీసులు రెండు వర్గాలతో మాట్లాడి వివాదాన్ని సర్దుమనిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరసనలు వ్యక్తం చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జిలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News