కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటేనే ఏపీకి మంచిది: సీఎం జగన్

అసెంబ్లీలో సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడారు. పలు కారణాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి తగ్గిందని.. హైదరాబాద్ వంటి మహా నగరాన్ని కోల్పోవడం వల్ల పెట్టుబడులు తగ్గాయన్నారు.

Update: 2024-02-06 12:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడారు. పలు కారణాల వల్ల రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి తగ్గిందని.. హైదరాబాద్ వంటి మహా నగరాన్ని కోల్పోవడం వల్ల పెట్టుబడులు తగ్గాయన్నారు. కనీసం ప్రత్యేక హోదా ఉన్న నిధులు వచ్చేవని.. అది లేకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. ఈ కారణాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు మన అవసరం ఉంటే.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించవచ్చు.

ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రావొద్దని కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిని సీఎం జగన్ అన్నారు. అలాగే గత ప్రభుత్వం కంటే తాము తక్కువ అప్పులు చేస్తున్నామని.. తక్కువ అప్పులతో ఎక్కువ పథకాలు అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని పొందుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ప్రజలకు మేము చెప్పింది ఏమీ చేయలేదని ఆరోపణలు చేసే వారు ఎన్నికల్లో ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరుతున్నారని.. గతంలో ఆయన పాలనలో చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైన ఉందా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మేనిఫెస్టో హామీలు ఎప్పుడు పట్టించుకోలేదన్నారు. నమ్మిన వాడు మునుగుతాడు.. నమ్మించన వాడు దోచుకుంటాడన్నదే.. చంద్రబాబు సిద్ధాంతం అని అన్నారు. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది వెన్ను పోటు ఒక్కటే అని చంద్రబాబు పై సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News