AP Govt.: ఏపీ కొత్త సీఎస్‌‌గా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ (కే Vijayanand) నియమితులయ్యారు.

Update: 2024-12-30 01:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్‌ (కే Vijayanand) నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్‌) కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ (S Suresh Kumar) ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఎస్‌ (CS)గా విధులు నిర్వర్తిస్తున్న నీరబ్ కుమార్‌ ప్రసాద్‌ (Neerabh Kumar Prasad) రేపు పదవీ విరమణ చేయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర తదుపరి సీఎస్‌ (CS)గా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.విజయానంద్‌ (K Vijayanand)ను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎంపిక చేశారు. వైఎస్సార్ జిల్లా (YSR District) రాజుపాలెం Rajupalem) మండలం అయ్యవారిపల్లె (Ayyvaripalle) ఆయన స్వస్థలం. మొదట ఆయన ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా కూడా పని చేశారు. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco), జెన్ఎన్‌కో (AP GENCO) ఎండీగా సుధీర్ఘ కాలం పాటు విధుల్లో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధకారిగా కూడా పని చేశారు. 2025 నవంబర్‌లో విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.

Tags:    

Similar News