వరద నష్టంపై ప్రభుత్వం ప్రకటన.. మొత్తం 45 మంది మృతి

వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరదల మూలంగా ఏపీలో మొత్తం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది.

Update: 2024-09-08 08:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వరదల మూలంగా ఏపీలో మొత్తం 45 మంది మృతి చెందినట్లు పేర్కొంది. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 35 మంది మృతి చెందగా.. గుంటూరు జిల్లాలో ఏడుగురు , పల్నాడు జిల్లాలో ఒకరు, ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. మొత్తంగా 1,81,53,870 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 19, 686 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం ఏర్పడింది. 3,913 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. 558 కిలో మీటర్ల అర్బన్‌ రోడ్లు ధ్వంసమయ్యాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగున్నాయి.


Similar News