ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు.. ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది...
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో ఎంపీలు(Mp), ఎమ్మెల్యేలు(Mla)గా గెలవడం ఆ తర్వాత జనాల దగ్గరకు వెళ్లకపోవడం ఇదీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. అయితే ఏపీ(Ap)లో మాత్రం వినూత్నంగా అడుగులు పడుతున్నాయి. పింఛన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. కానీ ప్రజలతో ఎంపీలు భేటీలు కావడం లేదు. అంతేకాదు పార్లమెంట్ కూడా హాజరుకావడంలేదు. దీంతో ప్రజలకు ఎమ్మెల్యేలు, ఎంపీలను మరింత చేయాలని కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎవరైనా ప్రజా సమస్యలు తెలుసుకుని అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లోనూ పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అయినా సరే ప్రజల వద్దకు వెళ్లాలని సూచించింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత దగ్గరవుతారని భావిస్తోంది. అలాగే ప్రజా సమస్యలను అసెంబ్లీకి, పార్లమెంట్‌కి వినిపిస్తారని ఆశిస్తోంది.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పితే ఉత్తమ లెజిస్లేచర్, పార్లమెంట్‌లో అయితే ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో అవార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సభ్యుల పని తీరు, ప్రశ్నలు అడుగుతున్న తీరును సైతం పరిగణనలోకి తీసుకోనుంది. అంతేకాదు సభలో ప్రవర్తన ఆధారంగా కూడా అవార్డు అందజేయనున్నారు. అయితే ఎంపిక విషయంలో మాత్రం కమిటీకి బాధ్యతలు అప్పగించనున్నారు. త్వరలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ఎంపిక చేసి ఎంపీ, ఎమ్మెల్యేలకు అవార్డులు అందించనున్నారు.