Chandrababu ఎఫెక్ట్: AP government సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ రాష్ట్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ సభలకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సూచనలు చేసింది. వీటిని ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. కాగా, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గుంటూరు, కందుకూరు సభల్లో జనం భారీ సంఖ్యలో పాల్గొని, తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Also Read..