Breaking:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్(Viral Fever), తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు.

Update: 2024-09-05 12:32 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్(Viral Fever), తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూనే విజయవాడ వరదల(Flood)పై సమీక్షలు నిర్వహించారు. ఇవాళ(గురువారం)కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వ‌ర‌ద త‌గ్గిన త‌ర్వాత చేప‌ట్టాల్సిన పారిశుద్ధ్య ప‌నులు(Sanitation works), మంచినీటి స‌ర‌ఫ‌రాపై పంచాయితీరాజ్ అధికారుల‌కు(Panchayati Raj Officers) ఆదేశాలు జారీ చేశారు.

వ‌ర‌ద త‌గ్గిన ప్రాంతాల్లో వెంట‌నే సూప‌ర్ క్లోరినేష‌న్ చేయాలని, పారిశుద్ధ్య ప‌నుల‌ను వేగ‌వంతంగా చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏ మాత్రం ఆలస్యం చేసిన ప్రజలంతా తీవ్రమైన అనారోగ్యం బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న ప్ర‌జ‌లు మళ్లీ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డ‌కుండా చూడాలని కోరారు. ఏలేరు రిజ‌ర్వాయ‌ర్(Reservoir) వ‌ర‌ద‌పై అధికారుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.


Similar News