Breaking: 45 ఏళ్లు దాటిన మహిళల అకౌంట్లలోకి భారీగా డబ్బులు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో హామీ నిలబెట్టుకున్నారు. ...

Update: 2024-03-07 07:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో హామీ నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వైఎస్సార్ చేయూ పథకానికి సంబంధించి నాలుగో విడత నగదును విడుదల చేశారు. మూడు విడతల్లో 45 నుంచి 60 ఏళ్ల వయస్సున్న మహిళల అకౌంట్లలో రూ. 18, 750 జమ చేశారు. తాజాగా నాలుగో విడత డబ్బులను సీఎం జగన్ విడుదల చేశారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని పేద మహిళలకు సాయం అందించారు. మొత్తం 26 లక్షల 98 వేల 931 మంది మహిళల అకౌంట్లలో నగదు జమ చేశారు.


అనకాపల్లి జిల్లా పిసినికాడ పర్యటనలో సీఎం జగన్ బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేశారు. నాలుగు విడతల మొత్తం కలిపి ఒక్కో మహిళలకు రూ. 75 వేలు ఆర్థిక సాయం అందించారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 12, 2024న ఈ పథకాన్ని ప్రారంభించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 19, 189.60 కోట్లు విడుదల చేశారు. నాలుగో విడతలో రూ. 5, 060.49 కోట్లు సాయం అందజేశారు.

Read More..

వైసీపీ మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తారా?  

Tags:    

Similar News