Sea Plane: భవిష్యత్తంతా టూరిజందే: ఏపీ సీఎం
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గాడితప్పిన పరిపానను, దెబ్బతిన రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి సంపాదిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గాడితప్పిన పరిపానను, దెబ్బతిన రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి సంపాదిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులైందని, ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. విజయవాడ - శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని (AP Tourism) అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను మన ఏపీలో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ.. తను ఇప్పుడు నాలుగో టర్మ్ సీఎంగా చేస్తున్నానని, కానీ గత మూడు టర్మ్‌లతో పోల్చితే ఈ టర్మ్‌లో పరిపాలన గాడిన పెట్టడం కష్టంగా ఉందని, అయినా తాను ఎంత కష్టమైనా భరించి రాష్ట్రాన్ని గాడిన పెడతానని, అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గెలుపు ప్రజలదేనని, వెంటిలేటర్‌పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారని ప్రజలన్ని చంద్రబాబు కొనియాడారు. అలాగే ప్రపంచంలో ఇక భవిష్యత్తంతా టూరిజందేనని, క్యాపిటలిజం. సోషలిజం. కమ్యూనిజం అన్నీ ఇజాలు పోయాయని, ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం ఉంటుందని, అదే టూరిజం అని, ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. అలాగే సీప్లేన్ సర్వీసులను ప్రారంభించడంలో కీలక పాత్ర వహించిన స్పైస్ జెట్ సంస్థను అభినందించారు.