ఏపీలో కొత్త పాలసీలు.. అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు...

Update: 2024-10-03 12:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) పాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక నుంచి ప్రతిశాఖలోనూ కొత్త పాలసీలను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా శాఖలు పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలు (Agricultur Sectors), పారిశ్రామిక రంగం(Industrial sector), సేవల రంగం (Services sector)లో వృద్ధి(Growth)పై సచివాయలంలో సమీక్ష నిర్వహంచిన సీఎం చంద్రబాబు.. ఆర్థిక పురోగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రతిశాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామని, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అలాగే 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. వైఎస్ జగన్ (YS Jagan) హయాంలో ప్రజల తలసరి ఆదాయం వృద్ధి రేటు బాగా తగ్గిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వమంటే పథకాలు మాత్రమే కాదని, ప్రజల ఆదాయం పెంచాలని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది ఐదో స్థానమని, మెరుగుపడేందుకు విజన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. జవనరిలో పీ-4 విధానాన్ని ఆచరణలోకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు.


Similar News