‘గౌరవాన్ని కాపాడుకోండి’.. కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజమౌళి రియాక్షన్

అక్కినేని కుటుంబం, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా వివాదం సద్దుమణగడం లేదు.

Update: 2024-10-03 14:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని కుటుంబం, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా వివాదం సద్దుమణగడం లేదు. వరుసగా ఇండస్ట్రీ నుంచి నటీనటులు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ సహా అనేకమంది హీరోలు సోషల్ మీడియా వేదికగా స్పందించి.. మంత్రి వ్యాఖ్యలపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తాజాగా.. ఈ అంశంపై దర్శకధీరుడు రాజమౌళి(Director Rajamouli) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ) వేదికగా పోస్టు పెట్టారు. ‘సరిహద్దులను గౌరవించండి. గౌరవాన్ని కాపాడుకోండి. నిరాధార ఆరోపణలు సహించరాదు. ముఖ్యంగా ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ సహించదు’ అని రాజమౌళి పేర్కొన్నారు.

Read More...

రాజకీయాలు దిగజారకూడదు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ రియాక్షన్ 




 



Similar News