Breaking: ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..ఆర్థిక అంశాలపై చర్చ

ఢిల్లీలో ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు..

Update: 2024-08-17 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చించారు. అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ప్రధానిని చంద్రబాబు కోరారు.

ఈ సాయంత్రం 6 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు. అనంతరం రాత్రి 7గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. విభజన సమస్యలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చంద్రబాబు కోరనున్నారు. 

Tags:    

Similar News