నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యపై మంత్రులు ప్రధానంగా చర్చించారు...

Update: 2024-10-16 10:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కేబినెట్(AP Cabinet) భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగ(Unemployment) సమస్యపై మంత్రులు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో 20 మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పించేలా పారిశ్రామిక పాలసీని రూపొందించాలని నిర్ణయించారు. 2024-29 కాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాలను ఎస్కో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ(Industrial Policy) 4.0 ఉండాలని, 2030 నాటికి ఇంటింటికి ఓ పారిశ్రామిక వేత్త తయారు చేసేలా ఈ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు.

ఇంకా మరిన్ని అంశాలపైనా చర్చించిన మంత్రులు​ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ క్లీన్​ ఎనర్జీ పాలసీ(AP Clean Energy Policy)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పునరుత్పాదక విద్యుత్​, పంప్​స్టోరేజి ద్వారా విద్యుత్​ఉత్పత్తికి ఆమోదం తెలిపారు. గ్రీన్​ హైడ్రోజన్​ వనరుల వినియోగాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ పాలసీని రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. నూతన ఎంఎస్‌ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎలక్ట్రానిక్​ పరిశ్రమల్ని సైతం ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. డ్రగ్స్​ నియంత్రణ, ధరల నియంత్రణ, ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీలను నియమించాలని సమావేశంలో చర్చించారు. ఏపీ రాజధాని అమరావతి సెంటర్‌గా ఏపీ యాంటీ నార్కోటిక్​టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్​గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Similar News