ఏపీ రాజధాని అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-10-16 17:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati) అభివృద్ధిపై మంత్రి నారాయణ(Minister Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై వర్షాలు, వరదల ప్రభావం ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆయన స్పందించారు. ఎంత ఫ్లడ్ వచ్చినా అమరావతిపై ప్రభావం ఉండదని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ(Assembly), హైకోర్టు(High Court) నిర్మాణాల కోసం జనవరి నెలాఖరులోపు టెండర్లు పిలుస్తామని తెలిపారు. సీడ్ క్యాపిటల్(Seed Capital) నిర్మాణానికి సింగపూర్‌ను సంప్రదించాలా..?, వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వరల్డ్ బ్యాంక్(World Bank) నిధులు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అమరావతిలో బ్యాంక్ ప్రతినిధులు పర్యటిస్తున్నారని సేర్కొన్నారు. 360 కిలో మీటర్ల మేర రోడ్లకు టెండర్లు పూర్తి చేస్తామన్నారు. అమరావతిలో 18 టవర్లలో 432 అపార్ట్ మెంట్ల పూర్తికి రూ.524 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 


Similar News