ఏపీ కేబినెట్ భేటీ : అజెండాలో 49 అంశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ సమావేశమైంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ సమావేశమైంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ కేబినెట్‌లో 49 అజెండాలపై చర్చ జరగనుంది.విద్యార్థులకు ఇంటర్ నేషనల్ బాక్యులరేట్ (ఐబీ) విద్యా విధానంపై కేబినెట్ చర్చ జరగనుంది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లు 2023కి కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితోపాటు ఏపీ జీపీఎస్ బిల్లుకు 2023కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే మావోయిస్టు, రెవెల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌లను ఏడాది పాటు నిషేధం విధించే అంశంపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు భద్రతపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఈనెల 21 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎన్నిరోజులు నిర్వహించాలి అనేదానిపై మంత్రివర్గం చర్చించనుంది.