AP Budget: ఎన్టీఆర్ కు నివాళి.. ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు (AP Assembly Session) ముందు.. ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం రాష్ట్ర 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

Update: 2024-11-11 04:21 GMT
AP Budget: ఎన్టీఆర్ కు నివాళి.. ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు (AP Assembly Session) ముందు.. ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం రాష్ట్ర 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) బడ్జెట్ ప్రతులను తీసుకుని అంతకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి (NTR Statue) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ రాజధాని రైతుల్ని పలుకరించారు. అమరావతి ఉద్యమంలో వారంతా కీలక పాత్ర పోషించారని అభినందించారు. కాగా.. ఈసారి రాష్ట్ర బడ్జెట్ సూపర్ సిక్స్ (Supersix) హామీలను నెరవేర్చే దిశగా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు పేర్కొంటున్నారు. 

Tags:    

Similar News