Hyd: ఏపీ బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు

ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు దగా పడ్డారని బీఆర్‌ఎస్​అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు...

Update: 2023-06-27 15:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు దగా పడ్డారని బీఆర్‌ఎస్​అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. హైదరాబాద్ ఏపీ కార్యాలయంలో గుంటూరు జిల్లాకి చెందిన మహబూబ్ బాషా ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాకి చెందిన పలువురు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోందని దుయ్యబట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని వైసీపీ ప్రజాప్రతినిధుల్ని ప్రజలు తరిమికొడుతున్నట్లు తోట చంద్రశేఖర్ గుర్తు చేశారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యారని తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నట్లు తెలిపారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి ఏపీలో జరగాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.

కాగా అనంతపురానికి చెందిన ఎండి రహమతుల్లా. అలీ అహ్మద్, ఎండీ ఇబ్రహీం, న్యాయవాది ఎండీ ముజాఫర్ సమి , నిరసనమెట్ల శ్రీనాథ్, మహ్మద్ హమీద్, కురుబ నాగరాజు, సమత ఖాన్, ఎండీ సాజిద్ షా, ఎండీ మిరాజ్. మహ్మద్​ ఇర్ఫాన్, ఫిరోజ్ ఖాన్, షేక్ అహ్మద్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లాం ప్రకాష్ , నరసరావు పేటకు చెందిన దేవసహాయాన్ని కండువాలతో చంద్రశేఖర్​ పార్టీలోకి ఆహ్వానించారు.

Tags:    

Similar News