Somu Veerraju: సొమ్ములు మావి..సోకులు మీవా?
తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్యా్బ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఒక వేడుకగా వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ..
దిశ, డైనమిక్ బ్యూరో: తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్యా్బ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఒక వేడుకగా వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఈ ట్యాబ్స్ పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాబ్‌ల పంపిణీలో కేంద్రం వాటా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభియాన్‌లో భాగంగానే ట్యాబ్‌లు పంపిణీ చేశారని సోము ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో కోస్తాంధ్ర, రాయలసీమ పదాధికారుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలను గొంతు విప్పకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు.
ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
వచ్చే ఎన్నికలకు అంతా సన్నద్ధం కావాలని పార్టీ పదాధికారులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. కార్యకర్తలను సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం అందిస్తు్న్న సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టిక్కర్లు మార్చి అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని సోము వీర్రాజు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర స్థాయి నాయకులు పని చేసిన సందర్భంగా మాత్రమే లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.
డిసెంబర్ 25న మాజీ ప్రధాని వాజ్‌పేయీ జన్మదిన సందర్భంగా సుపరిపాలన దినోత్సవం నిర్వహిస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో మూడేళ్లు వయస్సు సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసు రిక్రూట్మెంట్ ఆలస్యం చేయడంతో యువతలో నైరాశ్యం ఏర్పడిందన్నారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్స్ కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా అభయాన్‌లో భాగమేనని చెప్పుకొచ్చారు. నాడు-నేడు నిధుల్లో కూడా కేంద్రం వాటా ఉందని పేర్కొ్న్నారు. సొమ్ములు కేంద్రానివి సోకులు మాత్రం వైసీపీ ప్రభుత్వానివి అంటూ ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న తీరు మారాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శించినా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్లను పోలీసులతో ప్రభుత్వం ఇబ్బంది పెట్టిస్తోందని సోము ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను గొంతు విప్పకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ఏకపక్షంగా అణిచివేస్తున్నారని సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ రాష్ట్రాల మధ్యవిద్వేషాలు రెచ్చగొట్టారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీపైనా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు వీఆర్ఎస్ ఖాయమన్నారు.. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు న్యాయం జరగడం లేదని అన్నారు. తెలంగాణ నుంచి బీసీలు వేరే రాష్ట్రానికి తరలిపోయేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ద్వేషించిన వ్యక్తికి జాతీయ పార్టీ పెట్టే హక్కు లేదన్నారు. ఆంధ్రులను ద్వేషించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన కేసీఆర్‌కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
కమలాపురంపై Cm Jagan ప్రత్యేక దృష్టి.. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం