మూడో రోజుకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఆ విషయంలో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజుకు చేరుకున్నాయి.

Update: 2024-02-07 04:48 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈ రోజు జరగనున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అధికార ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు ప్రభుత్వం పెట్టనుంది. అలానే రానున్న ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని సమాచారం.

2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఈ రోజు ఉదయం 11 గంటల 3 నిమిషాలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఓ వైపు శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, అలానే శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరో వైపు సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024 ఏపీ ఉద్యోగుల నియామకాలు, ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, అలానే క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 లను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

 

Tags:    

Similar News