రూ.1.10 లక్షల కోట్లు ఏమైనట్లు?: సీఎం జగన్‌ను నిలదీసిన పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలోనే(2020-21) లెక్కల్లో చూపకుండా రూ.1.10 లక్షల కోట్లు ఖర్చే చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలోనే(2020-21) లెక్కల్లో చూపకుండా రూ.1.10 లక్షల కోట్లు ఖర్చే చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. రూ.1.10 లక్షల కోట్లు అనధికారికంగా ఖర్చు చేశారని కాగ్ కూడా తప్పుబట్టింది అని గుర్తు చేశారు. ఇవి ప్రజల దగ్గర మద్యం అని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, ఉద్యోగుల జీపీఎస్,ఎన్‌పీఎస్, పీఎఫ్ మరియు గ్రామ పంచాయితీ నిధులు దారి మరల్చినవి కాదా అని ట్విటర్ వేదికగా నిలదీశారు. ఇదే కదా నేను చెప్పేది సీఎం వైఎస్ జగన్..దీనికి మీ సమాధానం ఏంటి అని దగ్గుబాటి పురంధేశ్వరి నిలదీశారు.