AP News:విజయవాడ చేరుకున్న బాలినేని.. పవన్‌తో భేటీకి మరో నేత కూడా రెడీ!

ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-19 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ దక్కించుకోలేకపోయారు. దీంతో పలువురు వైసీపీ నేతల్లో అసహనం నెలకొంది. ఇప్పటికే కొందరు పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు. తాజాగా మరో ఇద్దరు నేతలు జనసేనలో చేరేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మరికాసేపట్లో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను కలవనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తమ అనుచరులతో విజయవాడకు చేరుకున్నారు. పవన్‌తో భేటీ అనంతరం జనసేనలో చేరే దానిపై వీరు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. వీరి బాటలోనే మరికొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌తో అరగంట పాటు చర్చించిన సామినేని ఉదయభాను ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. రేపు(శుక్రవారం) పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతానని తెలియజేశారు. జనసేన బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని, వివాదాలకు తావులేకుండా నడుచుకుంటానని పేర్కొన్నారు.

Read More..

పవన్‌తో భేటీకి రెడీ అయిన బాలినేని.. గ్రీన్ సిగ్నల్‌ కోసం వెయిటింగ్! 


Similar News