వైసీపీకి మరో భారీ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పనున్న సీనియర్ నేత

ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-23 05:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. దీంతో పలువురు పార్టీ నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరుతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీని వీడనున్నట్లు తెలుస్తోంది. నేడు(బుధవారం) ఆమె అధికారికంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురైన ఆమె మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఆమె అప్పటినుంచి వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్‌గా కనిపించడంలేదు. 

Tags:    

Similar News