న‌వంబ‌రు 9న‌ శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 10 నుండి 18 వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 9వ తేదీ గురువారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది అని టీటీడీ వెల్లడించింది.

Update: 2023-11-06 11:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 10 నుండి 18 వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 9వ తేదీ గురువారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది అని టీటీడీ వెల్లడించింది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారని తెలిపింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారని టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

న‌వంబ‌రు 10న ధ్వ‌జారోహ‌ణం

‘శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో న‌వంబ‌రు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మ‌ధ్య ధ‌నుర్‌ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌తిరోజూ ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహ‌న‌సేవ‌లు జ‌రుగ‌నున్నాయి’అని టీటీడీ వెల్లడించింది.

వాహనసేవల వివరాలు :

10-11-2023 - ధ్వజారోహణం, చిన్నశేషవాహనం.

11-11-2023 - పెద్దశేషవాహనం, హంసవాహనం.

12-11-2023 - ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం.

13-11-2023- కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం.

14-11-2023 - పల్లకీ ఉత్సవం, వ‌సంతోత్స‌వం, గజవాహనం.

15-11-2023- స‌ర్వ‌భూపాల వాహ‌నం, స్వర్ణరథం, గరుడవాహనం.

16-11-2023- సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.

17-11-2023 - రథోత్సవం, అశ్వ వాహనం.

18-11-2023- పంచమితీర్థం, ధ్వజావరోహణం.

Tags:    

Similar News