జగన్ హెలికాప్టర్ వెనక్కి పంపిస్తాం - పరిటాల సునీత హెచ్చరికలు
జగన్ అనంతపురం పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత ( Paritala Sunitha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ దిగకుండా జ
దిశ, వెబ్ డెస్క్: జగన్ అనంతపురం పర్యటనపై ఎమ్మెల్యే పరిటాల సునీత ( Paritala Sunitha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ దిగకుండా జగన్ ( Ys Jagan) వెనక్కి పంపే శక్తి ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు పరిటాల సునీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ( Anantapur District ) పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల హత్యకు గురైన వైసిపి పార్టీ (YCP) కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు.. అనంతపురం జిల్లాకు వెళ్ళనున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఈ నెల 8వ తేదీన అంటే రేపు... పాపిరెడ్డి పల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు జగన్. అయితే.. జగన్మోహన్ రెడ్డి పర్యటనపై స్థానిక లీడర్, ఎమ్మెల్యే పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండు కూడా ఉన్నాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందని హెచ్చరించారు. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. కానీ మాకు CM చంద్రబాబు ( Cm Chandrababu ) ఇలాంటి సంస్కృతి నేర్పలేదని వెల్లడించారు.
గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారని గుర్తు చేశారు పరిటాల సునీత. వాహనాలు తనిఖీలు చేసి... మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారని చురకలంటించారు. ఒక చావును రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని ఆగ్రహించారు. ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధిత కుటుంబానికి సహాయం చేయాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడని నిప్పులు చెరిగారు పరిటాల సునీత. బీసీలు అంటే అంత ప్రేమ ఉంటే... రాప్తాడు నియోజకవర్గానికి ఇన్చార్జిగా బీసీ నాయకున్ని నియామకం చేయాలని హితువు పలికారు.