జగన్ భద్రత ఇష్యూ.... వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
జగన్ భద్రత వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది...

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former cm Jagan) హెలికాప్టర్(Helicopter)లో శ్రీసత్యసాయి జిల్లా రామగిరి(Ramagiri) వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ జగన్‌కు భద్రత లోపం తలెత్తింది. ఒక్కసారిగా వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ హెలిపాడ్ వద్దకు భారీగా దూసుకెళ్లారు. అంతేకాదు అక్కడ నుంచి బారికేడ్ల(Barricades)ను ముందుకు నెట్టేశారు. ఒకరినొకరు తోసుకున్నారు. భద్రత చూస్తున్న పోలీసులను సైతం పక్కకు నెట్టేశారు. హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లు సరిగా లేకపోవడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.ఈ తోపులోటలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

అయితే ఇందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి(Former YSRCP MLA Topudurthi Prakash Reddy) కారణమని పోలీసులు గుర్తించారు. హెలిప్యాడ్ వద్ద సరైన బారికేడ్లు ఏర్పాటు చేయడంలో తోపుదుర్తి నిర్లక్ష్యం వహించారని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వం వైఫల్యమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌కు సరైన భద్రత కల్పించలేదని విమర్శిస్తున్నారు.