లింగమయ్య హత్యకు రామగిరి ఎస్సై కారణం.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేత లింగమయ్య హత్యకు రామగిరి ఎస్సై కారణమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

Update: 2025-04-09 06:07 GMT
లింగమయ్య హత్యకు రామగిరి ఎస్సై కారణం.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: పోలీసుల బట్టలూడదీస్తామన్న వైఎస్ జగన్(Ys Jagan) వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్ర హోంమంత్రితో పాటు పోలీసులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. జగన్ వ్యాఖ్యలను ఖండించారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి(Former YSRCP MLA Topudurthi Prakash Reddy) వ్యాఖ్యానించారు. అంతేకాదు జగన్‌పై ఎస్సై సుధాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) మెప్పుకోసం రామగిరి ఎస్సై మాట్లాడారని ఆరోపించారు. జగన్‌ను విమర్శించే స్థాయి ఎస్సై సుధాకర్‌కు లేదన్నారు. రామగిరి(Ramagiri)లో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) కారణమని ఆరోపించారు. చంద్రబాబు మెప్పుకోసం పని చేసే పోలీసులను బట్టలూడదీస్తామన్న జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు. పోలీసులపై చంద్రబాబు వ్యాఖ్యలు కనిపించవా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలు ఎందుకు అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి(Former MLA Topudurthi Prakash Reddy) నిలదీశారు. 

Tags:    

Similar News