నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే: మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆసక్తికర వ్యాఖ్యలు
తనకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం జగనేనని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు..
దిశ, వెబ్ డెస్క్: తనకు రాజకీయ భిక్ష పెట్టింది సీఎం జగనేనని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని చెప్పారు. బీసీ మహిళ అయిన తనకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సముచిత స్థానం కల్పించలేదని తెలిపారు. కుల గణనకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఇందుకు తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె పేర్కొన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం ఒక్క జగన్‌కే సాధ్యమైందని బుట్టా రేణుక తెలిపారు.
కాగా బుట్టా రేణుక 2014 ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో బుట్టా రేణుక మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.