గుత్తిలో దంపతుల ఘరానా మోసం.. 86 మందికి కుచ్చు టోపీ
అనంతపురం జిల్లా గుత్తిలో దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు...
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుత్తిలో దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని 86 మంది నుంచి రూ. 1.60 కోట్లు వసూలు చేసి హైదరాబాద్ ఉడాయించారు. గుత్తి శివారు ప్రాంతంలో రాణి నాగేశ్వరి, సాయి దుర్గాప్రసాద్ అనే దంపతులు ఎమ్.ఎస్. సొల్యూషన్స్ పేరుతో కన్సల్టెన్సీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. హెడ్ ఆఫీసు హైదరాబాద్ ఉందని చెప్పి నమ్మబలికారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయని వాట్సప్ గ్రూపులు ద్వారా నిరుద్యోగులను ఆకర్షించారు. అలా ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు చెందిన 86 మంది నిరుద్యోగుల నుంచి కోటి 60 లక్షలు వసూలు చేశారు. అయితే ఉద్యోగాలు ఫేక్ తెలియడంతో బాధితులు రోడ్డెక్కారు. తమ పెద్దవాళ్లకు తెలియకుండా డబ్బులు ఇచ్చామని.. ఇప్పుడు వాళ్లకు తెలిస్తే చావగొడతారాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన మోసంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.