Monkeys:వానర సైన్యం.. వింత చేష్టలతో దాడులకు పాల్పడుతున్న వైనం
కారంపూడి పట్టణ పరిధిలో వానర సైన్యం ఒకటి నుంచి వేల సంఖ్యలో జన నివాసాల మధ్య జీవిస్తూ ఉన్నాయి.
దిశ, కారంపూడి: కారంపూడి పట్టణ పరిధిలో వానర సైన్యం ఒకటి నుంచి వేల సంఖ్యలో జన నివాసాల మధ్య జీవిస్తూ ఉన్నాయి. పట్టణ ప్రజలు, చిరు వ్యాపారస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గతంలో కోతులను సర్కస్ లేదంటే జూ పార్కులో, జీవనోపాధి కోసం వానరాలను ఆడించే వారి దగ్గర చూసేవాళ్లం. ఎందుకంటే కోతులు ఎక్కువగా అడవుల్లోనే ఉండేవి. అరుదుగా బయట కనిపిస్తే వాటిని చూసి ఆనందపడుతూ ఆహారాన్ని అందించే వాళ్లం. కానీ ఇప్పుడు సీన్ మారింది. అడవుల్లో ఉండాల్సిన వానరాలు సైన్యంగా మారి జనావాసాల్లో తిరుగుతున్నాయి. కోతుల వల్ల ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడో ఒక దగ్గర కాకుండా పట్టణం మొత్తం మండల వ్యాప్తంగా విస్తరించి పోయి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
చిరు వ్యాపారస్తులు పండ్లు కూరగాయలు కూడా దాడి చేసి, తింటున్న కోతులు. రహదారిపై తిరుగుతున్న వానరాలు వల్ల ఇటీవలే ప్రమాదాలు వానరాల వల్ల జిల్లాలో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇళ్లలోకి చొరబడి తినుబండారాల కోసం ఎగబడుతున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలోని వస్తువులు, పప్పు దినుసులు, బియ్యం తదితర వాటిని చిందరవందరగా చేస్తున్నాయి. ఇళ్లలో పెంచుకుంటున్న కూరగాయలు, జామ, మామిడి, సపోటా పండ్ల చెట్లు సైతం ఇష్టం వచ్చినట్లుగా పీకేస్తున్నాయి. ఇంటి యజమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రోడ్డుపై చిరు వ్యాపారస్తులకు కోతులు చెమటలు పట్టిస్తున్నాయి.
మొక్కజొన్న, పల్లికాయ, బొబ్బర్లు, కందికాయ, టమాటాలు,బీరకాయ, ఆకుకూరలు, చిక్కుడుకాయ తో పాటు పచ్చి మిర్చి, బెండకాయ మినహ పలు కూరగాయలన్నీ తింటూ పీకేస్తున్నాయి. కోతుల భయానికి వ్యాపారస్తులు కూడా ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వీటిని కదిలిస్తే చాలా కోతులు ఎగ పడి దాడులు చేస్తున్నాయి. అందుకే వ్యాపారస్తులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. కోతులు రాకుండా ఉండేందుకు ఉదయం, రాత్రుళ్లు చప్పుడు చేస్తూ, బాణసంచా కాల్చుతూ నానా పాట్లు పడుతున్నారు.ఉదయం కోతులతొ, రాత్రుళ్లు పగలు పట్టణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు పట్టణ వ్యాప్తంగా కోతులను తిరిగి అడవుల్లోకి పంపేందుకు చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం పై రైతులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో కోతులను పట్టే వాళ్ళని పిలిచి వాటిని బోనులో బంధించి అడవుల్లో వదిలేసేవారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుని రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా వాసులు కోరుతున్నారు.