Road Accident : కర్నూల్ నుంచి చంపారన్ వెళ్తున్న అంబులెన్స్ బోల్తా
కర్నూల్ నుంచి చంపారన్(Karnul - Champaran) వెళ్తున్న అంబులెన్స్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు.
దిశ, వెబ్ డెస్క్ : కర్నూల్ నుంచి చంపారన్(Karnul - Champaran) వెళ్తున్న అంబులెన్స్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. ఏపీలోని కర్నూల్ నుంచి బీహార్ లోని చంపారన్ కు ఓ రోగిని తరలిస్తున్న అంబులెన్స్ బోల్తా పడటంతో అక్కడిక్కడే నలుగురు దుర్మరణం పాలవగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ జబల్ పూర్ - నాగపూర్(NH 34) హైవే మీద వెళ్తుండగా.. మధ్యప్రదేశ్ లోని సియోని(Seoni) వద్ద అదుపు తప్పి, పాదాచారుని మీదికి దూసకువెళ్ళి అనంతరం పక్కన ఉన్న కరెంట్ స్థంబంను ఢీకొట్టిందటి. ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లతో సహ తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు అక్కడిక్కడే మరణించగా.. మిగిలిన ఐదుగురికి తేవర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.