Amaravati : AP కేబినెట్ సంచలన నిర్ణయం..ఆ బిల్లుకు ఆమోదం..!

సచివావాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.

Update: 2024-08-07 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సచివావాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ ఎన్నికల్లో ఇంతకముందు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాళ్లు పోటీకి అనర్హత అనే నిబంధన ఉండేది. తాజాగా ఆ అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశలలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది.కాగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ నిబంధనను తీసేస్తామని కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే..బొమ్మల పిచ్చితో జగన్ రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ,సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించాలన్న మంత్రుల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని వాటి స్థానంలో రాజముద్రతో కూడిన పట్టాపాసు పుస్తకాలను పంపీణీ చేయాలనీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మృత్స్య కారులకు నష్టం చేకూరేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన GO-217ను రద్దు చేసింది. అలాగే ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చేందుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. 


Similar News