Big Alert:కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ విడుదల?
రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable candidates)కు బిగ్ అలర్ట్.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కానిస్టేబుల్ అభ్యర్థుల(Constable candidates)కు బిగ్ అలర్ట్. స్టేజ్-2 PMT/PET పరీక్షల హాల్‌టికెట్లు(Hall tickets) ఇవాళ(బుధవారం) మ.3 గంటలకు రిలీజ్ కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టేజ్-2 ఫిజికల్ టెస్టులు(Stage-2 Physical Tests) ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇక అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఆఫీసు(ఉ.10-సా.6) సమయంలో నంబర్లను సంప్రదించండి. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.