వాహనదారులకు అలర్ట్.. నేడు విశాఖలో ట్రాఫిక్ అంక్షలు
విశాఖ వాసులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ వాసులకు నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నేవీ డే వేడుకల నేపథ్యంలో విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు. నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానుండటంతో.. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బీచ్ రోడ్డులో ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రత్యామ్నాయా మార్గాల చూసుకోవాలని పోలీసులు కోరారు. బీచ్ రోడ్డులో జరిగే నేవీ డే వేడుకలను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో విజయవాడలో కూడా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు ముర్ము విజయవాడకు చేరుకోనున్నారు. విమానశ్రయంలో రాష్ట్రపతికి ఏపీ గరర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. అనంతరం 11.45 గంటలకు పోరంకిలో రాష్ట్రపతి ముర్ముకు పౌర సన్మానం జరగనుంది. ఇది ముగిసిన తర్వాత రాష్ట్రపతి గౌరవార్థం రాజ్ భవన్‌లో ప్రభుత్వ విందు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు నేవీ డే వేడుకల కోసం రాష్ట్రపతి ముర్ము విశాఖకు వెళ్లనున్నారు. సాయంత్రం ఆర్కే బీచ్‌లో నౌకాదళ ప్రదర్శనను తిలకించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము తిరుమలకు వెళ్లనున్నారు.
Also Read....