BigBreaking : వైసీపీకి షాక్.. జనసేన గూటికి చేరిన మరో సీనియర్ నేత..
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన గూటికి చేరారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన గూటికి చేరారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రామకృష్ణ జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అలానే క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధి పై పూర్తి అవగాహనా ఉన్న వ్యక్తి కొణతాల రామకృష్ణ అని.. అలాంటి ప్రజా నాయకుడు జనసేన లోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు.
ఇక జనసేన అధినేత రామకృష్ణను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గతంలో తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన గూటికి చేరే అంశం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాను జనసేన పార్టీ లో చేరుతున్నట్లు ఏనాడు స్పష్టం చెయ్యలేదు. ఈ రోజు ఉన్నపళంగా ఆయన జనసేన పార్టీ లో చేరడం సభ్యత్వం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఉన్నటుండి హడావిడిగా కొణతాల జనసేన గూటికి చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.