Breaking: విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

Update: 2024-05-31 14:40 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామానాయుడు రోడ్డులో డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు లంకపట్నానికి చెందిన కిశోర్, హేమంత్‌ ఒకే కుంటుంబానికి వారిగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రమాదానికి అతివేగమే కారణంగా అంచనా వేశారు. వాహనదారులు నడిపేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ చేయాలని చేయాలన్నారు. రోడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Similar News