సడన్‌గా లోయలో దూకిన వ్యక్తి.. ఖంగుతున్న శ్రీవారి భక్తులు

తిరుమలలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేగింది...

Update: 2025-03-05 13:25 GMT
సడన్‌గా లోయలో దూకిన వ్యక్తి.. ఖంగుతున్న శ్రీవారి భక్తులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) కలకలం రేగింది. అందరూ చూస్తుండగా అవ్వచారి కోన లోయ(Avvachari Kona valley)లోకి దూకారు. అలిపిరి మెట్ల మార్గం(Alipiri Stairway)లో వచ్చిన వ్యక్తి.. అక్కగార్లఆలయం(Akkagarla Temple) వద్దకు రాగానే లోయలోకి దూకేశారు. దీంతో విజిలెన్స్ పోలీసుల(Vigilance Police)కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లోయలోకి దూకిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. తాడు సాయంతో లోయలోకి వెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీ ఫుటేజులు పరిశీలించారు. భక్తుడు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

అయితే లోయలోకి దూకిన వ్యక్తి గుండు చేయించుకున్నారని స్థానికులు తెలిపారు. తాము రక్షించేందుకు ప్రయత్నం చేశామని, ఈ లోపే లోయలోకి దూకేశారని చెప్పారు. అయితే ఆ భక్తుడు ఎవరో తమకు తెలియని స్థానికులు పేర్కొన్నారు.

Tags:    

Similar News