తిరులమలో నేలకూలిన భారీ వృక్షం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల చెట్టు కొమ్మ విరిగి మీద పడి ఓ యువతి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.

Update: 2024-07-14 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల చెట్టు కొమ్మ విరిగి మీద పడి ఓ యువతి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మురువకముందే తిరుమలలో ఇదే తరహా ఇన్సిడెంట్ మరొకటి జరిగింది. తిరుమలలో శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షాలకు ఓ భారీ వృక్షం నెలకొంది. ఈ ఘటనలో రెండు టెంపో వాహనాలు, ఓ కారు ధ్వంసం అయ్యింది. చెట్టు కూలిన సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అధికారులు ఊపీరిపీల్చుకున్నారు. ఈ తరహా వరుస ఘటనలతో తిరుమలకు వెళ్లే భక్తులు ఆందోళనకు గురి అవుతున్నారు.


Similar News