Ap News: కానిస్టేబుల్ ప్రాణం తీసిన భారీ గుంత
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో దారుణం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ సురేష్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే సమయంలో బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌తో సహా ఆయన రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే సురేశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే సురేష్ ప్రాణాలు విడిచారు. ఇదే రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.