ఇరిగేషన్ కార్పొరేషన్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం..

బెజవాడ ఇరిగేషన్ కార్పొషన్ ఆఫీసులో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2024-07-12 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెజవాడ ఇరిగేషన్ కార్పొషన్ ఆఫీసులో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్ వారికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ మీడియా ఛానల్‌తో ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈ ఘటనపై మాట్లాడుతూ.. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మంటల్లో మూడు కంప్యూటర్లు, కొన్ని ముఖ్యమైన డాకుమెంట్లు, రికార్డులు కాలిపోయాయని చెప్పారు. ప్రమాద కారణాలపై ప్రస్తుతం పోలీసుల విచారణ చేపడుతున్నారని ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ చెప్పుకొచ్చారు. ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలోకి దిగిందని.. పోలీసులు విచారణ చేపడుతున్నారని ఆయన వెల్లడించారు.


Similar News