Visakhapatnam: కంటైనర్ టెర్మినల్‌లో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగ
శనివారం మధ్యాహ్నం విశాఖపట్టణం(Visakhapatnam)లోని బీచ్ రోడ్డులో ఉన్న కంటైనర్ టెర్మినల్( container terminal)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: శనివారం మధ్యాహ్నం విశాఖపట్టణం(Visakhapatnam)లోని బీచ్ రోడ్డులో ఉన్న కంటైనర్ టెర్మినల్( container terminal)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెర్మినల్‌లో ఉన్న ఓ కంటెయినర్‌లో మంటలు చెలరేగగా.. ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు, ఇతర సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ కంటైనర్‌లో లిథియం బ్యాటరీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.