కూటమి అధికారంలోకి వస్తే పవన్‌కి బంపర్ ఆఫర్..మోడీ కీలక నిర్ణయం
ఏపీలో జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఏపీలో అధికారం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారుతోంది. అయితే ఫలితాల కంటే ముందుగానే పవన్ వద్ద బీజేపీ రెండు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఫలితాల తర్వాత నిర్ణయం ఏపీలో భవిష్యత్ లో పార్టీ ఎదగాలంటే పవన్ మద్దతు అవసరమని బీజేపీ నాయకత్వం గుర్తించినట్లు సమాచారం.
ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ రాష్ట్రానికి పరిమితం కానున్నారు. కూటమికి అధికారం దక్కకుంటే మాత్రం పవన్‌తో కలిసి ఏపీలో బలోపేతం కావాలనేది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమికి అధికారం దక్కకపోతే పవన్‌ను కేంద్రంలో మోడీ కేబినెట్‌లో సహాయ మంత్రిని చేయాలనేది ఆ పార్టీ నాయకత్వం ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదన పైన పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారనుంది.