విజయవాడ వరదల కారణంగా.. రూ.7 వేల కోట్ల నష్టం:మాజీ మంత్రి మల్లాది విష్ణు

సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాల కారణంగా ఏపీలో విజయవాడ(Vijayawada)లో భారీ స్థాయిలో వరదలు వచ్చాయి.

Update: 2024-09-18 12:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాల కారణంగా ఏపీలో విజయవాడ(Vijayawada)లో భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. దీంతో పది రోజుల పాటు విజయవాడలోని పలు కాలనీలు వరద నీటిలో ఉండిపోయాయి. కాగా వరదల కారణంగా వేల కోట్ల నష్టం జరిగిందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ వరదలకు దాదాపు రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లింది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రూ.700 కోట్లు కేటాయించిందని. మాజీ మంత్రి మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. అలాగే వరదల కారణంగా ఆస్తి పన్ను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా.. ఆస్తి పన్ను వాయిదా వేయడం కాదని.. పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటుగా.. ఒక నెల విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని, వరదల కారణంగా దెబ్బతిన్న ఆటోకి 10 వేలు చాలవని.. కొత్త ఆటో ఇవ్వాలన్నారు. అలాగే విజయవాడలో తలెత్తిన భారీ వరదల కారణంగా.. MSMEలు భారీగా నష్టపోయాయని.. వారిని ఆదుకోవాలని వరద బాధితులకు రూ.2 లక్షల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.


Similar News