చెవిరెడ్డి ఇలాఖాలో 60వేల దొంగ ఓట్లు.? తొలగించాలంటూ టీడీపీ ఫిర్యాదు

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నియోజకవర్గంలో 60 వేల దొంగ ఓట్లు వైసీపీ నాయకులు చేర్చారని టీడీపీ ఆరోపించింది.

Update: 2023-11-17 09:27 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నియోజకవర్గంలో 60 వేల దొంగ ఓట్లు వైసీపీ నాయకులు చేర్చారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ ఓట్లను తొలగించాలని ముఖేశ్ కుమార్ మీనాను కోరుతూ వినతిపత్రం అందజేశారు. మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అనుకూల ప్రాంతాల్లో కొత్తగా 45 పోలింగ్‌ బూత్‌లు పెంచారని టీడీపీ ఆరోపించింది. ఈ 45 పోలింగ్ బూత్‌లను తొలగించి యధావిధిగా ఉంచాలని కోరారు. మరోవైపు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో 6 వేల ఓట్లు తొలగించేందుకు ఇంగ్లీష్‌లో నోటీసులు ఇచ్చారని ..వీటిని తొలగించొద్దని కోరారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేశ్ మీనాను కలిసిన వారిలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ షరీఫ్‌, అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావులు సైతం ఉన్నారు.

Tags:    

Similar News