కొప్పర్తికి పరిశ్రమల వెల్లువ

ఇప్పటికే పలు రకాల పరిశ్రమలతో ప్రతిష్టాత్మకతను సంతరించుకుంటూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతున్న కొప్పర్తి పారిశ్రామికవాడకు మరిన్ని పరిశ్రమలు వెల్లువలా రానున్నాయి.

Update: 2023-03-04 02:27 GMT

దిశ, కడప: ఇప్పటికే పలు రకాల పరిశ్రమలతో ప్రతిష్టాత్మకతను సంతరించుకుంటూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతున్న కొప్పర్తి పారిశ్రామికవాడకు మరిన్ని పరిశ్రమలు వెల్లువలా రానున్నాయి. కడప జిల్లా కడప నగరానికి సమీపంలో 6,700 ఎకరాలలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏర్పాటైన కొప్పర్తి పారిశ్రామికవాడకు ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిష్ట చేకూరుతూ వస్తోంది. ఇప్పటికే అక్కడి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో పలు సెల్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. వీటితోపాటు ఎలక్ట్రిక్ బస్సులు, వాటి ఉపకరణాలు, గార్మెంట్ ఇలాంటి పరిశ్రమలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి.

కొప్పర్తికి తాజాగా మరో 21 కంపెనీలు రావడం ఈ పారిశ్రామికవాడ మరింత ప్రాధాన్యత సంతరించుకోనుంది. శుక్రవారం జరిగిన విశాఖ పారిశ్రామికవేత్తల సమ్మిట్‌లో 21 పరిశ్రమలను 15 వందల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు పారిశాకువేత్తలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా 54,000 మందికి ఉపాధి కల్పించే ఉద్దేశాన్ని వెల్లడించారు. విశాఖ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సీఈవో గౌతమి వివరాలను వెల్లడించారు. విశాఖ సమ్మిట్‌తో కడప జిల్లా కొప్పర్తికి పరిశ్రమలు రావడం సంతోష దాయకంగా చెప్పుకోవాలి.

Tags:    

Similar News