ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 164 మందికి కరోనా సోకిన నేపథ్యంలో ఎస్మా యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ యాక్ట్ ప్రకారం ఆరు నెలల కాల వ్యవధిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు ప్రభుత్వం ఆదేశాలను అనుసరించాల్సి ఉంటుంది. ఇప్పటికే కరోనా కట్టడికి రెండు పాత చట్టాలను బూజుదులిపిన జగన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా ఎస్మాతో వైద్య సర్వీసులు, […]

Update: 2020-04-04 00:31 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 164 మందికి కరోనా సోకిన నేపథ్యంలో ఎస్మా యాక్ట్ (అత్యవసర సేవల నిర్వహణ చట్టం) ప్రయోగించింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ యాక్ట్ ప్రకారం ఆరు నెలల కాల వ్యవధిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు ప్రభుత్వం ఆదేశాలను అనుసరించాల్సి ఉంటుంది.

ఇప్పటికే కరోనా కట్టడికి రెండు పాత చట్టాలను బూజుదులిపిన జగన్ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా ఎస్మాతో వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బందితో పాటు వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా, మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రత, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వేస్ట్‌ కూడా ప్రభుత్వ పరిధిలోకి రానున్నాయి.

ఒక రకంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థ మొత్తం ప్రభుత్వం ఆధీనంలో పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరిస్తే వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఏపీలో తొలి కరోనా మరణం నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags: esma, essential service maintenance act, andhrapradesh, private hospitals, 6 months esma

Tags:    

Similar News