ఏపీ టాప్.. తెలంగాణకు థర్డ్‌ ప్లేస్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2018 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి ఒక స్థానాన్ని దిగజార్చుకుంది. తెలంగాణ మూడో స్థానంలో నిలవగా, పదిస్థానాలను మెరుగుపరుచుకుని ఉత్తరప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ శాఖ(డీపీఐఐటీ) శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను విడుదల చేసింది. బిజినెస్ […]

Update: 2020-09-05 10:27 GMT

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2018 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి ఒక స్థానాన్ని దిగజార్చుకుంది. తెలంగాణ మూడో స్థానంలో నిలవగా, పదిస్థానాలను మెరుగుపరుచుకుని ఉత్తరప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ శాఖ(డీపీఐఐటీ) శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులను విడుదల చేసింది.

బిజినెస్ రీఫామ్ యాక్షన్ ప్లాన్ 2019 ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ధారించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన రిపోర్ట్‌ పేర్కొంది. రాష్ట్రాలు సరైన దిశలో చర్యలు తీసుకున్నాయని, ఈ ర్యాంకుల ద్వారా రాష్ట్రాలు, యూటీలు వాణిజ్యానికి అనుకూలమైనవిగా అభివృద్ధి చెందుతాయని సీతారామన్ ఈ నివేదికను విడుదల చేస్తూ పేర్కొన్నారు. తెలంగాణ తర్వాత మధ్యప్రదేశ్(4), జార్ఖండ్ (5), ఛత్తీస్‌గడ్(6), హిమాచల్‌ప్రదేశ్(7), రాజస్తాన్(8), పశ్చిమ బెంగాల్(9), గుజరాత్(10)లు నిలిచాయి.

Tags:    

Similar News