ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలి : టీఎస్ విద్యుత్ జేఏసీ
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ విద్యుత్ సంస్థల్లోకి ఏ ఒక్క ఆంధ్రా ఉద్యోగిని తీసుకున్నా ఊరుకునేది లేదని, మార్చి 31 నుంచి ఈ విషయమై నిరాహారదీక్షకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు శివాజీ, అంజయ్యలు ప్రకటించారు. ఏపీ నుంచి రిలీవ్ అయిన ఆంధ్రా ఉద్యోగులు సోమవారం జాయినింగ్‌కు వచ్చిన సందర్భంగా వేలాది మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు. జాయినింగ్‌కు వచ్చిన […]
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ విద్యుత్ సంస్థల్లోకి ఏ ఒక్క ఆంధ్రా ఉద్యోగిని తీసుకున్నా ఊరుకునేది లేదని, మార్చి 31 నుంచి ఈ విషయమై నిరాహారదీక్షకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు శివాజీ, అంజయ్యలు ప్రకటించారు. ఏపీ నుంచి రిలీవ్ అయిన ఆంధ్రా ఉద్యోగులు సోమవారం జాయినింగ్‌కు వచ్చిన సందర్భంగా వేలాది మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ ముందు ధర్నాకు దిగారు. జాయినింగ్‌కు వచ్చిన ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులను గేటు వద్దే అడ్డుకున్నారు. జస్టిస్ ధర్మాధికారి కమిటీ తుది తీర్పు ప్రకారం ఏపీ విద్యుత్ సంస్థలు తెలంగాణ ఉద్యోగులను కాకుండా ఆంధ్ర స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ నుంచి రిలీవ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని అన్నారు. ఏపీ విద్యుత్ సంస్థలు కావాలని తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆంధ్ర నుంచి వచ్చిన ఉద్యోగులు వెనక్కి వెళ్లేదాకా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి ఈ విషయమై రిలే నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. ఈ ధర్నాలో తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు రామేశ్వర్ శెట్టి, నాసర్, వినోద్, గణేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags : power department, ap employees, ts vidyut soudha, protest