లైంగిక వేధింపులతో వ్యవసాయ జేడీ సస్పెన్షన్

దిశ, వెబ్ డెస్క్: ఆయన ఓ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ. అంటే జిల్లాలో వ్యవసాయం శాఖకు సంబంధించి అన్ని తానే చూసుకోవాలి. తన సహచర ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉంటూ ప్రోత్సహించాల్సింది పోయి.. లైంగికంగా వేధించాడు. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో మహిళా ఉద్యోగులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాపై సస్పెన్ష్ వేటు పడింది. లైంగికంగా […]

Update: 2020-08-03 08:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆయన ఓ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ. అంటే జిల్లాలో వ్యవసాయం శాఖకు సంబంధించి అన్ని తానే చూసుకోవాలి. తన సహచర ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉంటూ ప్రోత్సహించాల్సింది పోయి.. లైంగికంగా వేధించాడు. రోజురోజుకీ వేధింపులు ఎక్కువ అవ్వడంతో మహిళా ఉద్యోగులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషాపై సస్పెన్ష్ వేటు పడింది. లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ మహిళ ఉద్యోగులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఆయన గుంటూరులో డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సమయంలోనూ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ మంత్రి కన్నాబాబు జేడీ హబీబ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News