బ్లాక్ మార్కెట్‌లో ఆనందయ్య మందు.. రేటు ఎంతో తెలుసా.?
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుపై రోజుకో విషయం బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బ్లాక్ మార్కెట్‌లో ఆనందయ్య మందును కొందరు కేటుగాళ్లు అమ్మకానికి పెట్టారు. ఓ కరోనా బాధితుడికి నాగరాజు అనే వ్యక్తి ఆనందయ్య మందును ఏకంగా రూ. 20వేలకు బేరానికి పెట్టాడు. ఉచితంగా ఇచ్చే మందును 20వేలకు అమ్ముతారా అంటూ బాధితుడి స్నేహితుడు నాగరాజును ప్రశ్నించాడు. దీంతో నాగరాజు డబ్బులు తీసుకుని పరారయ్యాడు. అనంతరం బాధితుడు పోలీసులను […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుపై రోజుకో విషయం బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా బ్లాక్ మార్కెట్‌లో ఆనందయ్య మందును కొందరు కేటుగాళ్లు అమ్మకానికి పెట్టారు. ఓ కరోనా బాధితుడికి నాగరాజు అనే వ్యక్తి ఆనందయ్య మందును ఏకంగా రూ. 20వేలకు బేరానికి పెట్టాడు. ఉచితంగా ఇచ్చే మందును 20వేలకు అమ్ముతారా అంటూ బాధితుడి స్నేహితుడు నాగరాజును ప్రశ్నించాడు. దీంతో నాగరాజు డబ్బులు తీసుకుని పరారయ్యాడు. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.