అమిత్ షాను ‘అంకుశం రామిరెడ్డి’తో పోల్చిన ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి ఎవరు? ఇంకెవరు.. అని ఠక్కున అమిత్ షా అని చెప్పేస్తారు. కానీ.. బిహార్ ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్ ప్రకారం ఆయన కాదు. టాలీవుడ్ దివంగత నటుడు, ‘రాములమ్మ’ విలన్ రామిరెడ్డి! ఇంకా చెప్పాలంటే అంకుశం ‘రామిరెడ్డి’. ఎందుకంటారా..? ఈనెల 22 కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టిన రోజు. దాంతో.. ఆరోజు ఈ ఎమ్మెల్యే ఓ ట్వీట్ చేశారు. అమిత్ షాకు బర్త్ డే విషెస్ […]
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి ఎవరు? ఇంకెవరు.. అని ఠక్కున అమిత్ షా అని చెప్పేస్తారు. కానీ.. బిహార్ ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే సురేంద్ర ప్రసాద్ యాదవ్ ప్రకారం ఆయన కాదు. టాలీవుడ్ దివంగత నటుడు, ‘రాములమ్మ’ విలన్ రామిరెడ్డి! ఇంకా చెప్పాలంటే అంకుశం ‘రామిరెడ్డి’. ఎందుకంటారా..? ఈనెల 22 కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టిన రోజు. దాంతో.. ఆరోజు ఈ ఎమ్మెల్యే ఓ ట్వీట్ చేశారు. అమిత్ షాకు బర్త్ డే విషెస్ తెలిపారు. కానీ, ఫొటో మాత్రం రామిరెడ్డిది పెట్టారు. అయితే.. కావాలనే అమిత్ షా ఫొటో బదులు విలన్ రామిరెడ్డి ఫొటో వాడారా? అన్నది సస్పెన్స్‌గా మిగిలింది. విషయం ఏమిటంటే.. ఈ ఎమ్మెల్యే 1990 నుంచి బెలగాంజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓసారి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.
https://twitter.com/iSurendraYadav/status/1451497661769531394?s=20